వైట్ స్కీన్‌ సర్జరీ చేయించుకోలేదు:కాజోల్

12
- Advertisement -

రంగుల లోకంలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక రూమర్లు, పుకార్లు సమాజంలో షీకార్లు చేస్తుంటాయి. తాజాగా బాలీవుడ్‌ నటి కాజోల్ కు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నావని కానీ ఇప్పుడు తెల్లగా మారిపోయావని కామెంట్లు చేస్తున్నారు. దీంతో స్కీన్ వైటెనింగ్ సర్జరీ చేయించుకున్నట్టు కామెంటు చేస్తున్నారు. దీంతో స్పందించిన కాజోల్ ఒక ఫోటో అలాంటి ట్రోల్సర్స్‌ అందరికీ సమాధానం చెప్పింది కాజోల్‌. మీరెలా తెల్లగా అయ్యారు అని అడిగేవారందరికి ఓ ఫోటో చూపిస్తూ నా సమధానం ఇదే అని చెప్పేస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది.

కాజోల్‌ తెల్లగా మారడం కోసం ఎటువంటి శస్త్రచికిత్సలు చేసుకోలేదని గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…నేను ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 10 సంవత్సరాలు ఎక్కువ సమయంలో ఎండలోనే షూటింగ్ చేయాల్సి వచ్చేదని అందుకే అలా కనిపించేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నేను ఎలాంటి శస్త్రచికిత్సలు చేసుకోలేదని చెప్పింది. ప్రస్తుతం కాజోల్ సలాం వెంకీ సినిమాలో నటించనుంది. అంతే కాదు ది గుడ్‌ వైఫ్‌ అనే వెబ్‌ సీరీస్‌ అనే వెబ్‌ సిరీస్‌ తో బిజిగా ఉంది.

ఇవి కూడా చదవండి…

నాని…’దసరా’ హార్ట్ బ్రేక్ సాంగ్‌

నటనలో పోటీ వల్ల కొంత భయపడ్డ:చరణ్‌

ముచ్చటగా మూడోసారి గాయం…

- Advertisement -