ఐటెం భామ కోసం పూరీ ప్రమోషన్‌..?

67

దర్శకుడు పూరీ జగన్నాధ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందగత్తెలను తీసుకొస్తుంటాడు. తన సినిమాలో ఐటెం సాంగ్‌ తప్పకుండ ఉండాల్సిందే. పూరీ జగన్నాధ్ భలే ట్యాలెంటెడ్. హీరోయిన్స్ నుంచి ఐటెం భామల వరకూ పూరీ పట్టుకొచ్చిన అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ఐటెం భామల విషయంలో అయితే పూరీ పెట్టే ఫోకస్ మామూలుగా ఉండదు.

Kyra Dutt in Balayya-Puri Film

పూరీ సినిమాలో తీసుకున్నాక.. ఆ భామకు క్రేజ్ తీసుకొచ్చేందుకు పూరీ ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్ మూవీతో టెంపర్ లో నోరా ఫతేహిని తీసుకొచ్చాడు. బిజినెస్ మ్యాన్ టైంలో శ్వేతా భరద్వాజ్ ను ఇలాగే ప్రమోట్ చేశాడు. పోకిరి టైంలో జ్యోతి రాణాకు ఇలాంటి క్రేజ్‌ ఏర్పడింది. ఇలా చూసుకుంటే పూరీ పరిచయం చేసిన భామలు చాలానే ఉన్నారు కానీ.. ఇప్పుడు పూరీ ఫోకస్ అంతా.. కైరా దత్ పై పెట్టేశాడు. ఈ అమ్మడు టాలీవుడ్ జనాలకు ఇంతకుముందే పరిచయం. రేసుగుర్రం సినిమాలో బూచాడే.. బూచాడే.. సాంగులో తన అందాలతో అలరించిన ఈ ఐటెం భామే ఈ కైరా దత్. అంతేకాదు క్యాలెండర్ గాళ్స్ సినిమాతో బాలీవుడ్‌లో కూడా బాగానే గుర్తింపు సంపాదించింది.

 అయితే ఇప్పుడు పూరీ జగన్నాధ్‌ ఈ ఐటం భామను టాలీవుడ్ లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ భామ పైసా వసూల్ మూవీలో ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. బాలయ్య తో కలిసి ఓ మాంచి బీట్ ఉన్న సాంగ్ కు డ్యాన్స్ చేస్తోంది. ఇప్పుడీ కైరా దత్ ను ‘శమంతకమణి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. పైసా వసూల్ లో యాక్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పింది. సౌత్ లో స్టార్ స్టేటస్ అంటే ఎలా ఉంటుందో ఈమెకు అర్ధమయ్యేలా రుచి చూపించాడు పూరీ జగన్నాధ్.