అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్ ని వైట్‌హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు.
కుశ్ దేశాయ్ 2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్, ఐయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్టర్‌గా చేశారు. అమెరికాలోని కీలకమైన రాష్ట్రాల్లో ప్రెస్ కార్యదర్శిగా కుశ్ దేశాయ్ వ్యవహరించినట్లు వైట్‌హౌజ్ తన ప్రకటనలో పేర్కొన్నది. బ్యాటిల్ గ్రౌండ్ లేదా స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
I’m back, back in the DC groove pic.twitter.com/MI7d8MeXep
— Kush Desai (@K_SDesai) January 25, 2025
Also Read:TTD: 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం