ఎంపీ పదవికి విజయసాయి రాజీనామా

26
- Advertisement -

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు.

తాను ఏ పార్టీలో చేరడం లేదని..వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని వివరించారు.

ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని తెలిపారు.

Also Read:మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం..

- Advertisement -