కుప్పంలో చంద్రబాబును ఢీ కొట్టేది.. అతనే?

23
- Advertisement -

టీడీపీకి కంచుకోట, చంద్రబాబు నాయుడి అడ్డాగా ఉన్న కుప్పం నియోజక వర్గంలో పట్టు సాధిచాలని వైఎస్ జగన్ గట్టి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వైసీపీ సత్తా చాటడంతో ఈ సీటుపై జగన్ దృష్టి కేంద్రీకరించారు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టే ఆయన వై నాట్ కుప్పం, వై నాట్ 175 నినాధాలను ఎంచుకున్నారు. కుప్పంలో వైసీపీని గెలిపిస్తే అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని కూడా గతంలో హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఇలాఖలో వైసీపీ జెండా ఎగరడం అంతా తేలికైన విషయమా అంటే ముమ్మాటికి కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 1989 నుంచి కుప్పం బరిలో నిలుస్తున్న చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు.

ఇక ఈసారి కూడా మరోసారి కుప్పం బరిలోనే నిలుస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాతో స్పష్టం చేశారు. అయితే ఆ మధ్య నారా భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు చంద్రబాబే మరోసారి పోటీలో ఉన్నట్లు తేలిపోయింది. ఇక వైసీపీ నుంచి బాబును ఢీ కొట్టేదేవరనేది గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎందుకంటే కుప్పం నియోజక వర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్.. చంద్రబాబుపై ఎవరిని పోటీలో నిలుపుతారనేది అందరిలోనూ క్యూరియాసిటిని పెంచుతోంది.

ఇక తాజాగా కుప్పం బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థిని జగన్ ప్రకటించారు.. ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఆ తరువాత అతడికి మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు పోటీగా వైసీపీ తరుపున ఎమ్మెల్సీ భరత్ బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టమైంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు పోటీగా వైసీపీ తరుపున కె. చంద్రమౌళి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక ఈసారి భరత్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరి ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు ఎంతవరకు పోటీనిస్తారో చూడాలి.

Also Read:ఎక్కువసార్లు టీ తాగితే..ఆ లోపం వస్తుందా!

- Advertisement -