kumbh mela 2025:గడ్డ కట్టే చలిలో చన్నీటి స్నానం

0
- Advertisement -

మహా కుంభమేళా కు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా.

యూపీ ప్రయాగ్‌రాజ్‌లొ జరిగే మహాకుంభమేళా కోసం వస్తున్న సాధువులు కఠిన దీక్షలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాగ సాధువు ప్రమోద్ గిరి మహారాజ్ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు 61 కుండల చన్నీటి స్నానం చేస్తున్నారు.

హఠయోగాలో భాగంగా 41 రోజులపాటు ఇలా చేయాల్సి ఉండగా సమయాభావం వల్ల 21 రోజులకు కుదించినట్లు ఆయన తెలిపారు. ఈ దీక్ష పూర్తయ్యాక 108 కుండల నీటితో స్నానం చేస్తానన్నారు.

పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లు, 56 మంది సైబర్ వారియర్ల బృందం అందుబాటులో ఉండగా కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ అందుబాటులో ఉంది.

Also Read:కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..కర్రలతో కొట్టుకున్న కార్యకర్తలు

- Advertisement -