- Advertisement -
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా మరోవైపు కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో ఎలాంటి నిబంధనలు లేకుండా హాజరవుతుండటం అందరిని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో పుణ్య స్నానాలు చేసేందుకు వస్తున్న సాధువులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
30 మంది సాధువులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు హరిద్వార్‌లో క్రిటికల్‌గా ఉన్న కేసులను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తరలిస్తుండగా స్థానిక ప్రజలను మాత్రం హోం ఐసోలేషన్‌లోకి పంపిస్తున్నారు.
మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది.
- Advertisement -