కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!

76
- Advertisement -

నేటి ఆధునిక యుగంలో కులాంతర వివాహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలం ప్రకారం వ్యక్తి ఆలోచనల్లో మార్పు కారణంగా కులాల పట్టింపు లేకుండా పెళ్లి చేసుకునేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రేమ పెళ్లిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే కులాంతర వివాహాలు చేసుకునే వారికి భరోసాగా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టిందని మీకు తెలుసా ? ఆ పథకం ఏంటి ? ఆ పథకానికి ఎవరెవరు అర్హులు ? ఎలా అప్లై చేసుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ” డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ థ్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ” పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పెద కుటుంబాలకు చెందిన దళితులను కులాంతర వివాహం చేసుకున్నా వారికి ఈ పథకం వర్తిస్తుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయి.. ఇతర కులాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటే వివాహం అయిన ఆ జంటకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 2.5 .లక్షలు లబ్ది చేకూరుతుంది.

అర్హతలు :
.* అబ్బాయి కి 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, అమ్మాయి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
* అమ్మాయి లేదా అబ్బాయి ఎవరో ఒకరు దళిత వర్గానికి చెందిన వారై ఉండాలి.
* వారి వివాహం హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
* కుటుంబ ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

కావలసిన పాత్రాలు
* వివాహం ఛేసుకున్న జంట యొక్క మూడు ఫోటోలు
* అమ్మాయి మరియు అబ్బాయి యొక్క కుల దృవీకరణ పత్రం మరియు వివాహ పత్రం
* అమ్మాయి మరియు అబ్బాయి విద్యార్హత కు సంబంధీచిన పాత్రాలు ( అనగా తీసి, టెన్త్ మార్క్స్ మేమో.. మొదలగునవి )
* గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన మ్యారేజ్ సర్టిఫికేట్
* వివాహ జంట కు సంబంధించిన జాయింట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు
* ఆదాయ పత్రం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్.. మొదలగునవి.

అప్లై చేసుకునే విధానం
ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారైతే ( gsws-nbm.ap.gov.in ) అనే వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇక తెలంగాణ వారైతే telanganaepass.cgg.gov.in అనే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌అంబేద్కర్‌..

KTR:అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది:కేటీఆర్

నిద్ర లేమితో నష్టాలు..

- Advertisement -