ఎకో టూరిజం పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

279
ktr
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. తన పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌,ఈటల రాజేందర్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ 2087 ఎకరాల్లో ఉన్న KCR ఎకో అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత చెట్ల ను నాటారు.

KCR ఎకో అర్బన్ పార్క్ లో చైన్ లింక్ ఫెన్సింగ్ తో పాటు ఇతర 155.60 లక్షల రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.అనంతరం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని ప్రారంభించారు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు అనతికాలంలోనే రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచినందుకు మంత్రులు సంతోషం వ్యక్తంచేశారు.మహబూబ్ నగర్ పట్టణంలోని అభివృద్ధి పనులపై రూపొందించిన “ప్రగతి పథం” ప్రత్యేక పుస్తకాన్ని మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

- Advertisement -