ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్లడం లేదు. టీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
కొత్తగా ఎంపికైన సభ్యులందరూ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ తదితర కీలక ప్రక్రియలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
సమావేశానికి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. దేశంలోని పార్టీలన్నింటికీ ఇప్పటికే లేఖలు రాశారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కావడం లేదు. విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఆయన ఈ సమావేశానికి హాజరు కావట్లేదు.