అన్నిపార్టీల అధ్యక్షులతో ప్రధాని భేటీ..

300
- Advertisement -

బుధవారం పార్లమెంట్‌లో అన్నిపార్టీల అధ్యక్షులతో ప్రధాని కీలక సమావేశం జరగనుంది.పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగుతుంది. ఈ సమావేశానికి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి,టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి దేశంలోని అన్ని రాజకీయ పార్టీ ల అధ్యక్షులకు లేఖలు వ్రాశారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని లేఖలో పేర్కొన్నారు.PM Modi

అజెండా లోని అంశాలు..

•దేశంలో అన్ని చట్ట సభలకు ( పార్లమెంట్ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు.

•వెనుకబడిన (“ఆస్పిరేషనల్ డిస్ట్రిక్స్” ) జిల్లాల అభివృధ్ధి .

•75 వ దేశ స్వాతంత్ర్య దినోత్సవాల నేపధ్యంలో “ నవ భారత” నిర్మాణం.

•పార్లమెంట్ సమావేశాలు మరింత ఫలవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకున్న మార్గాలు.

•మహాత్మ గాంధీ 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణ, చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్వహించాల్సిన బాధ్యతలు.

- Advertisement -