టాప్ 5లో తెలంగాణ:కేటీఆర్

245
KTR speech At REC Innovation Platform In T-Hub
- Advertisement -

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైప్పటికీ ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలవడం గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సోమవారం(జనవరి-29) కేంద్రం విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో దేశ ఎగుమతుల్లో ఐదు రాష్ట్రాల వాటా 70 శాతం ఉందన్నారని… అందులో తెలంగాణ కూడా ఒక భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. ఎగుమతుల్లో ప్రస్తుతం టాప్ 5 లో ఉన్న తెలంగాణ త్వరలో మొదటి స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR speech At REC Innovation Platform In T-Hub

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ హిత (ఎకో ఫ్రెండ్లీ) కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరుగుతాయని, హరితహారం వల్ల పచ్చదనం పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.దేశ ఎగుమతుల్లో 70 శాతం ఎగుమతులు.. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ర్ట, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాల నుంచే జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

హైదరాబాద్ లోని టి-హబ్ లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టి-హబ్ తో ఆర్ఈసీ ఒప్పందం కుదుర్చుకున్నది. విశ్వవిద్యాలయాలకు సాంకేతికతను జోడించి వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతామని కేటీఆర్ ప్రకటించారు. టి-హబ్, ఆర్ఈసీ ల ఒప్పందంలో భాగంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంలో తెలంగాణ, ఏపీలకు చెందిన 30 యూనివర్సిటీలకు చెందిన 1800 మంది విద్యార్థులు సోలార్ పవర్, విండ్ పవర్, బయో వేస్ట్ పవర్ పై రీసెర్చ్ చేయబోతున్నారని వెల్లడించారు. సుమారు 600 ప్రాజెక్టులపై పరిశోధిస్తారని తెలిపారు.

- Advertisement -