రాజమండ్రిలో ఇంటిలిజెంట్…

222
All set for Intelligent pre release
- Advertisement -

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్దమైంది.

అయితే ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో కాకుండా రాజమండ్రిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఫిబ్రవరి 4న రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. టీజర్‌ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించిన చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను సైతం కాస్త డిఫరెంట్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తోందట.

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

- Advertisement -