KTR:చేసింది చెప్పుకోలేకే ఓటమి?

24
- Advertisement -

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసింది చెప్పుకోలేకే ఓటమి పాలయ్యామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న‌ర్సంపేట‌లో ఏర్పాటు చేసిన వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..రైతు భ‌రోసా 15 వేలు ఇస్తా.. భూయ‌జ‌మాలకు కాదు కౌలు రైతుల‌కు కూడా రైతుభ‌రోసా ఇస్తాన‌ని రేవంత్ న‌మ్మ‌బ‌లికాడన్నారు. రైతు కూలీల‌కు ఏడాదికి 12 వేలు ఇస్తాన‌ని…. కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా రాలేదు. తొలిసారి మోస‌పోతే మోసం చేసినోడిది త‌ప్పు. రెండోసారి కూడా వాడి చేతిలో మోస‌పోతే మ‌న‌ది త‌ప్పు అయిత‌ద‌ని అన్నారు.

చ‌దువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని కోరుతున్నాను. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ప‌రిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించాలన్నారు. విద్యావంతుడు రాకేష్ రెడ్డిని గెలిపించి చట్టసభలకు పంపితే నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతాడన్నారు.

Also Read:విశాల్ రత్నం ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -