నేను చెప్పింది అబద్దమైతే శిక్షించండి-నిజమైతే ఆశీర్వదించండి: కేటీఆర్

171
ktr
- Advertisement -

ఎన్నికలకు ముందు ప్రెస్ క్లబ్‌కు మీట్ ది ప్రెస్ కు రావడం నాకు ఆనవాయితీ గా మారింది. అపుడు కలిసి వచ్చింది ఇవుడు కూడా ఇక్కడికి రావడం కలిసి వస్తుందని ఆశిస్తున్న అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేడు సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో మునిసిపల్ మంత్రి ,టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొని మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ గురించి అనిచ్చితి ఉండేది. కొందరు చీకటి రోజులు తప్పవన్నారు. వాటినన్నిటిని పటాపంచలు చేసి తెలంగాణను ,హైదరాబాద్‌ను అగ్రభాగాన నిలబెట్టిన ఏకైక వ్యక్తి సీఎం కెసిఆర్. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోలేదు .ఈ ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని అన్నారు.

నేను చిన్నపట్నుంచి హైదరాబాద్ లోనే పెరిగాను..చదువుకున్నాను. ఎర్రమంజిల్‌లో ఉంటూ జలమండలి కార్యాలయం మీదుగా బస్సు లో వెళ్లేవాడిని..అపుడు ఎండా కాలంలో జలమండలి ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు చూసేవాడిని..ఆరేళ్లలోనే అలాంటి నీళ్ళ సమస్యను అధిగమించగలిగాం.చీకటి తప్పదన్న హైదరాబాద్‌లో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నాం. అపుడు కరెంటు వస్తే వార్త ఇపుడు కరెంటు పోతే వార్త..తెలంగాణ రాగానే సీలేరు హైడెల్ పవర్ ప్రాజెక్టును మనను అడగ కుండానే గుంజుకున్నారు. ఇపుడు 24 వేల మెగావాట్ల స్థాపిత సామర్ధ్యానికి తెలంగాణ చేరుకోబోతుంది. మోడీకి ఆలోచన రాకముందే స్వచ్ఛ హైదరాబాద్‌కు సీఎం కెసిఆర్ పూనుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 90 శాతం మౌలిక సమస్యలను పరిష్కరించగలిగాం. శానిటేషన్‌లో హైదరాబాద్ దేశానికి రోల్ మోడల్‌గా ఉందని మంత్రి తెలిపారు.

చెత్త నుంచి 63 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం ప్రయత్నం జరుగుతోంది..ఇది దేశంలో ప్రథమ స్థానం. చెత్త సేకరణకు ఆధునిక వాహనాలు సమకూర్చాము. పేకాట క్లబ్బులు లేవు -గుడుంబా గబ్బు లేదు,పోకిరీలు ,ఆకతాయిల ఆగడాలు లేవు..శాంతి భద్రతల పరిరక్షణలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని యూకే సర్వే సంస్థ చెప్పింది. ఎస్‌ఆర్‌డీపీ కింద హైదరాబాద్‌లో రోడ్లు ,ఫ్లైఓవర్స్‌ నిర్మించుకున్నాం.1800 కోట్లతో సమగ్ర రోడ్డు అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నాం. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ కే తలమానికం..2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తీసుకు రాగలిగాం..పేరున్న ఐ టీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు ఆషామాషీగా రావడం లేదు..లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించాం.పెట్టుబడులకు హైదరాబాద్ అయస్కాంతంగా మారింది. రాజకీయ సుస్థిరత,శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నందునే పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచ వాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని కేటీర్‌ అన్నారు.

నగరంలో లక్ష బెడ్ రూంలను త్వరలోనే అంద జేస్తున్నాం. కరోనా వల్ల కొంత ఆలస్యం అయ్యింది.దాదాపు 9800 కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు తెలంగాణ తప్ప మరే రాష్ట్రం అయినా నిర్మిస్తోందా ?. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. గత ఆరేండ్లలో ఎలాంటి చార్జీలు పెంచలేదు. సామాన్యుడి నడ్డి విరిచే పని చేయలేదు.హైదరాబాద్‌లో 8 వేల పబ్లిక్ టాయిలెట్లు కట్టాం..కరోనా సమయంలో వలస కార్మికులను కూడా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాది. కరోనా,వరదల టైంలో మేము ప్రజల మధ్య ఉన్నాం,ప్రతిపక్షాలు ఎక్కడున్నాయో ?..అంతా చేశామని చెప్పడం లేదు ఇంకా చేస్తాం..నాలాల ఆక్రమణలు కఠిన చట్టం తెచ్చి తొలగిస్తాం.హైదరాబాద్‌కు గత ఆరేళ్లలో 60 వేల కోట్లు ఖర్చు పెట్టాం..నయా పైసాతో సహా లెక్కలు చెబుతాం..నేను చెప్పింది అబద్దమైతే మమ్మల్ని శిక్షించండి -నిజమైతే ఆశీర్వదించండి అని మంత్రి స్పష్టం చేశారు.

కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం..ఆరాచకం కావాలా ?అభివృద్ధి కావాలా విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..కొందరు విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ది పొందాలని చూస్తే ఊరుకోము.జీహెచ్‌ఎంసీలో గెలిచాక మళ్ళీ ప్రెస్ క్లబ్ కి వస్తా..సీఎం కెసిఆర్ ఏదీ చేసినా వ్యూహం తోనే చేస్తారు.డిసెంబర్‌లో బీజేపీ వ్యతిరేక పార్టీల మీటింగ్‌పై ఏం జరుగుతుందో చూద్దాం.. జీహెచ్‌ఎంసీలో రెండో స్థానం ఎవరిదో కాంగ్రెస్,బీజేపీలు తేల్చుకోవాలి..150 సీట్లలో మేము పోటీ చేయ బోతున్నాం..ఎవరితో మాకు దోస్తీ లేదు.ఈ సారి పాత బస్తీలో పది సీట్లు గెలుస్తాం.ఎంఐఎంను ఓడగొట్టి ఆ సీట్లు గెలుస్తాం.మా అభ్యర్థి యే మేయర్ అవుతారు..ఎంఐఎంకు ఎందుకిస్తాం ?మాకు పిచ్చా ?..మేము బల్దియా మీద గులాబీ జెండా ఎగరేస్తాం.గోల్కొండ మీద కెసిఆర్ ఇప్పటికే జాతీయ పతాకం ఎగురవేశారు.అక్కడ కాషాయం,కషయాలు ఎగుర వేయరు అని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.

వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీ గా చేపట్టాం. దీని కోసం 650 కోట్లు కేటాయించాము. కేంద్రం ఒక్క పైసా కేటాయించలేదు..ఎన్నికల సంఘం నిబంధనలు గౌరవిస్తాం ఎన్నికలయ్యాక వరద సాయం అందుతుంది..మీ సేవ కేంద్రాల్లో క్యూలు ప్రభుత్వం మీద ప్రజల విశ్వాసానికి నిదర్శనం..హైదరాబాద్ కు కేంద్రం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదు.కేంద్రం ఓ మిథ్య అని ఎన్టీఆర్ ఎపుడో చెప్పారు..గుజరాత్‌కు వరదలు రాకున్నా కేంద్రం వరదల్లా నిధులు కేటాయించింది. కర్ణాటకకు లేఖ రాయగానే నాలుగు రోజుల్లో సాయం అందించింది కేంద్రం..మేము ఏవరికి బి టీమ్ కాదు.తెలంగాణ ప్రజలకు ఏ టీమ్..జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ.కరోనా సమయం లోనూ బాధిత జర్నలిస్టులను మీడియా అకాడెమీ తరపున ఆదుకున్నాం..బీజేపీ జీహెచ్‌ఎంసీలో గెలిస్తే ఐఆర్‌ఎస్‌ తొలగిస్తామంటున్నారు..వాళ్ళది ప్రభుత్వం ఉందా ? అని మంత్రి ప్రశ్నించారు.

సీఎం పేద ప్రజల పక్షపాతి ..ఐఆర్‌ఎస్‌పై ఏ నిర్ణయం అయినా ఆయనే తీసుకోగలరు.నా వల్లే గతంలో టీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ 99 సీట్లలో గెలిచిందనే అపోహలు లేవు..అందరూ కష్టపడితేనే అన్ని సీట్లు వచ్చాయి .నేను ఇపుడున్న పదవిలో సంతోషంగా ఉన్నా..కెసిఆర్ నాయకత్వం వల్లే తెలంగాణ ఇంత పురోగతి సాధించింది..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం ప్రచారంపై ఇంకా స్పష్టత లేదు.నేనైతే ప్రచారం చేస్తాను ..ఒలికి పోయిన పాల గురించి మాట్లాడటం ఇపుడు అవసరం లేదు (దుబ్బాక ఫలితం పై ) అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -