నామినేషన్ దాఖలు చేసిన రాగం నాగేందర్ యాదవ్..

37
ragam

గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకుంది. పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు తమ మద్దతు దారులు,పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు.

ఇక గాంధీ నగర్ డివిజన్ నుండి బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్ధి ముఠా పద్మా నరేష్‌ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ నగర్ డివిజన్ నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు కవిత.