దొడ్డి దారిన పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అని ప్రశ్నించారు.
నీఆలోచనల్లో కుసంస్కారం … నీ మాటలు అష్ట వికారం స్పష్టంగా కనిపిస్తుందని.. తెలంగాణతల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రేస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే …. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అన్నారు. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో ,తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం అని తెలిపారు కేటీఆర్.
సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది….
దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు….
నీఆలోచనల్లో కుసంస్కారం … నీ మాటలు అష్ట వికారం …..
తెలంగాణతల్లి…
— KTR (@KTRBRS) August 28, 2024
Also Read:డెంగ్యూ..రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు ఇవే!