KTR: ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా గుండాగిరి

12
- Advertisement -

ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైకి కాంగ్రెస్ గుండాలు వచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేశాడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి, కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు అన్నారు.

పది మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు..హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందన్నారు. ఫిరాయింపులపై స్పీకర్‌ను కలిసి సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేశామన్నారు.దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టు జస్టిస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు.

 

Also Read:Harishrao:గాంధీతో దాడి చేయించింది రేవంతే

- Advertisement -