KTR: హైకోర్టు తిట్టినా ఇండ్లు కూల్చేస్తున్న తుగ్లగ్ రేవంత్..

4
- Advertisement -

హైకోర్టు తిట్టినప్పటికీ సిగ్గు, లజ్జ లేకుండా పేదల ఇండ్లను కూల్చివేస్తున్న తుగ్లక్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదవాళ్ల కోసం మేము లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టినం.. దమ్ముంటే నువ్వు రెండు లక్షలు కట్టి చూపిం అని సవాల్ విసిరారు.

అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసీరామ్‌ నగర్‌లో మూసీ ప్రాంత వాసులను పరామర్శించారు కేటీఆర్. ఎప్పుడు ఇండ్లు కూల్చుతరోనని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని చెప్పారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో పేదలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు.. ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్లు మనమీదికి రాదు. రేవంత్‌ రెడ్డి అడ్డుమారిగుడ్డిగా ముఖ్యమంత్రి అయి పది నెలలు అయింది. హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డి ఎవరూ ఓట్లు వేయలే. అందుకే ఇక్కడి ప్రజలపై పగబట్టిండు అని దుయ్యబట్టారు.

Also Read:Harishrao: కేటీఆర్‌పై దాడిని ఖండించిన హరీశ్‌

- Advertisement -