బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో!

70
- Advertisement -

బిర్యానీ ఆకు గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మాంసప్రియులకు బిర్యానీ ఆకు ఎంతో సుపరిచితం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ.. ఇలా రకరకాల బిర్యానీ తయారీలో ఆ యొక్క ఆకు లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. అయితే బిర్యానీ ఆకు కేవలం వంతలకు రుచిని కలిగించడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, బి6, ఐరన్, పొటాషియం,.. ఇలా ఎన్నో పోషకాలు మిళితమై ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి. బిర్యానీ ఆకుల్లో ఉండే ఫ్లెవనాయిడ్లు జీర్ణ వ్యవస్థను బలపరిచి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తాయి. .

ముఖ్యంగా పచ్చిగా ఉండే ఆకులను కషాయంగా చేసుకొని సేవిస్తే మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకులతో చేసిన కషయాన్ని ప్రతిరోజూ సేవితే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు దురమౌతాయట. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుందట. శరీరంలో ఆయా భాగాల్లో కలిగే నొప్పులను దూరం చేయడంలో బిర్యానీ ఆకు కషాయం ఎంతో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో ముక్కు కారడం ( సైనస్ ) సమస్య భాదిస్తుంటుంది. అలాంటి వారు ఎండు మిర్చిని బిర్యానీ ఆకులతో కలిపి తీసుకుంటే ఆ సమస్య దూరమౌతుంది. బిర్యానీ ఆకులను టీ రూపంలో తయారు చేసుకొని తాగడం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుందట. ఇక బిర్యానీ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:TDP:కడపలో టీడీపీ పరిస్థితేంటి?

- Advertisement -