గ్రీన్ కాఫీ ఎప్పుడైనా తాగారా..ఎన్ని ప్రయోజనాలో!

27
- Advertisement -

సాధారణంగా గ్రీన్ టి గురించి వినే ఉంటాం. చాలామంది ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఎందుకంటే గ్రీన్ టి తాగడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అయితే గ్రీన్ కాఫీ కూడా ఉంటుందని తెలుసా..? బహుశా గ్రీ కాఫీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. గ్రీన్ టి మాదిరిగానే ఇందులో కూడా ఎన్నో లాభాలు దాగి ఉన్నాయి. సాధారణంగా కాఫీ గింజలను వేయించి కాఫీపొడి తయారు చేస్తుంటారు. దీని ద్వారానే టి లేదా కాఫీ తయారు చేస్తుంటారు కానీ. కాఫీ గింజలను వేయించకుండా అలాగే వేసి తయారు చేసే దానినే గ్రీన్ కాఫీ అంటారు..

సాధారణంగా కాఫీ గింజలను వేయించినప్పుడు సహజసిద్దంగా ఉండే పోషకాలు నిర్వీర్యం అయ్యి కెవిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కానీ గింజలను పచ్చిగానే ఉంచి అలాగే కాఫీ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయట. పచ్చి కాఫీ గింజలలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియమ్తృంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇంకా గ్రీన్ టి మాదిరిగానే బరువు తగ్గడానికి కూడా గ్రీన్ కాఫీ సహాయపడుతుంది. ఇంకా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ గ్రీన్ కాఫీ ఎంతో మేలు చేస్తుందట. రక్తపోటు నియంత్రణలోనూ, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలోనూ గ్రీన్ కాఫీ సమర్థవంతంగా పని చేస్తుందని అధ్యయనలు చెబుతున్నాయి. ఇంకా గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలోనూ, అల్జీమర్ వ్యాధిని నివారించడంలోనూ గ్రీన్ కాఫీ సత్ఫలితలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ కాఫీ తయారు చేయువిధానం
గ్రీన్ కాఫీ గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి వేడి చేసుకొని తాగవచ్చు. లేదా గ్రీన్ కాఫీ గింజలను పొడిగా చేసుకొని ఆ పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి రంగు మరెంతవరకు మరిగించాలి. ఆ తరువాత సర్వ్ చేసుకొని సేవించవచ్చు. రోజుకు రెండు సార్లు ఈ గ్రీన్ కాఫీ తాగితే మేలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Tirumala:తిరుమల ఘాట్‌ రోడ్లలో ఆంక్షల సడలింపు

- Advertisement -