ఈ మధ్య కాంగ్రెస్ నేతలు అబద్దాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట ఒకరకంగా మాట్లాడడం.. ఆ తరువాత తూచ్ అంటూ వాటిని దాటవేయడం.. ఇదేంటి అని ప్రశ్నిస్తే తెల్లమొఖం వేసుకొని అక్కడి నుంచి జారుకోవడం ? ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న విధానంగా తెలుస్తోంది. ఆ మద్య రేవంత్ రెడ్డి కూడా ఇదే తరహా విధానంతో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కూడా అబద్ద ప్రగల్భాలు పలుకుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాను సిఎం పదవికి పోటీ పడడం లేదని తాజాగా స్పష్టం చేసిన ఆయన గతంలో సిఎం అభ్యర్థి రేస్ లో తాను ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా.
Also Read:Cumin:జీలకర్రతో ఆ సమస్యలన్నీ దూరం!
ప్రస్తుతం ఈ సిఎం అభ్యర్థి చర్చ కాంగ్రెస్ ను తిప్పలు పెడుతుండడంతో వెంటనే మాట మార్చి తాను సిఎం అభ్యర్థి రేస్ లో లేనని, ఆ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అధికార బిఆర్‌ఎస్ పై అబద్దాలతో బురద చల్లుతు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు భట్టి విక్రమార్క. పదేళ్ళలో ఉద్యోగాల కల్పనే జరగలేదని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయనకు ఐటీ శాఖ మంత్రి చెంప పెట్టుల ట్విట్టర్ లో సమాధానం చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో 2 లక్షల 32 వేల 308 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేశామని, 1లక్ష 60 వేల 83 ఉధోగలను భర్తీ చేశామని ఇంకా మరిన్ని వివరాలకు telanganajobstats.in వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చని కేటిఆర్ వివరణ ఇచ్చారు. దీంతో భట్టి విక్రమార్కపై మరియు కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్స్. కనీసపు అవగాహన కూడా లేకుండా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
In the last 9.5 years, Telangana Govt has identified 2,32,308 Direct Recruitment Job Vacancies and has filled in 1,60,083 jobs, which is the highest for any state in India with respect to its population.
Please visit the website https://t.co/E7YpfpEKVy for a detailed view of the…
— KTR (@KTRBRS) November 21, 2023