Cumin:జీలకర్రతో ఆ సమస్యలన్నీ దూరం!

45
- Advertisement -

నిత్యం వంటింట్లో వాడే మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. కూర ఏదైనా జీలకర్ర మాత్రం తప్పనిసరి. ఇది కూరల రుచిని పెంచడంతో పాటు సువాసనను కూడా అందిస్తుంది. అయితే జీలకర్రను కేవలం కూరల్లో మాత్రమే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ, వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషధంలా ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి వివిధ ఆరోగ్య సమస్యలను జీలకర్రను చిట్కాల రూపంలో ఉపయోగిస్తారు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !

ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో రెండు లేదా మూడు స్పూన్ల జీలకర్ర వేసి 20 నిముషాల పాటు మరిగించాలి. ఆ తరువాత మరిగించిన నీటిని చల్లార్చి వడకట్టి ఆ నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇంకా జీలకర్ర నీటిని పరగడుపున తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది..

ఇంకా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఊపిరితిత్తుల సమస్యలను కూడా తగ్గిస్తాయట. జీలకర్రలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం మీద ముడతల్ని, వయసు పెరగడం వల్ల వచ్చే మచ్చలను దూరం చేస్తాయట. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్.. వంటి ఇతరత్రా క్యాన్సర్ కారకాలను కూడా దూరం చేస్తాయట. ఇంకా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి జీలకర్ర ఒక చక్కటి పరిష్కారం గా ఉంటుందని ఆర్యువేద నిపుణులు చెబుతున్నారు. ఆ సమస్యలు ఉన్నప్పుడూ కొద్దిగా జీలకర్రను నోట్లో వేసుకొని నమిలితే.. జీర్ణ వ్యవస్థలోని ఎటువంటి సమస్య అయిన దురమౌతుందట. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే జీలకర్ర ఉపయోగాలు తెలుసుకొని సంబంధిత ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నప్పుడు పరిమితి మేర జీలకర్రను చిట్కాల రూపంలో వాడడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకుంటారా?

- Advertisement -