భాగ్యనగరంలో కొత్త బస్టాపులు…

262
- Advertisement -

నగరంలో ఏర్పాటు చేయనున్న నూతన బస్టాపుల పైన పురపాలక శాఖ కెటి రామారావు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్ధన రెడ్డి, అడిషనల్ కమీషనర్ అద్వైత్ కూమార్, వర్కింగ్ ఎజెన్సీలున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్టాప్లకు కన్నా అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో కూడిన వాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. సుమారు 800కు పైగా నూతనంగా బస్టాప్లు నగరంలో ఎర్పడనున్నయాని అధికారులు మంత్రికి తెలియజేశారు.

KTR Reviews New Bus Stop Works in Hyderabad

వాటిలో ఉన్న సౌకర్యాల ప్రకారం ఏ.బి.సి గ్రెడ్లుగా విభజించి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అన్ని సౌకర్యాలు ఉన్న ఎ గ్రేడ్ బస్టాపుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి జీహెచ్‌ఎంసీ కమీషనర్ కు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యను రెట్టింపు చేయాలని, ఈ మేరకు వర్కింగ్ ఎజెన్సీలకు బస్టాపుల నిర్మాణానికి స్ధలాలను అందజేయాలన్నారు. బస్టాపుల నిర్మాణంలో ఉన్న క్షేత్రస్ధాయి సమస్యలను పరిష్కారించేందుకు అడిషనల్ కమీషనర్ అద్వైత్ కూమార్ క్షేత్రస్ధాయిలో పర్యటించాలని అదేశారు జారీ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లో మార్చి మాసాంతానికి బస్టాపుల నిర్మానం పూర్తి చేయాలని అదేశించారు.

KTR Reviews New Bus Stop Works in Hyderabad

రోడ్డును అనుకొని ఉన్న ప్రభుత్వ సంస్ధలు, కార్యాలయాలతో చర్చించి అయా ప్రాంతాల్లో బస్సు బేలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో వచ్చే వారం ఒక సమావేశాన్నిఎర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. మెట్రో కారిడార్లలో బస్టాపుల ఎర్పాటు కోసం మెట్రో రైలు యండితో సమన్వయం చేసుకోవాలని మంత్రి జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియజేశారు. గడువులోగా పనుల పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టు రద్దు చేసేందుకు వెనకాడబోమని మంత్రి వర్కింగ్ ఎజెన్సీలకు మంత్రి తెలిపారు.

- Advertisement -