చేనేత వస్త్రాలకు మంచిస్పందన..

282
KTR Reviews Handloom department
- Advertisement -

రాష్ట్రంలో చేనేత వస్ర్తాలకు వివిధ వర్గాల నుంచి మంచి ప్రొత్సాహం లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట కార్యాలయంలో గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపై కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఒక సారి గుండ్లపోచంపల్లి పార్కులో పర్యటించి, అప్పారెల్ తో సంబంధంలేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి అనుమతులు రద్దు చేయాలని అదేశాలు ఇచ్చిన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పార్కులో తెలంగాణలో ఉన్న వివిధ హ్యాండిక్రాప్ట్ కళాకారులకు శిక్షణ ఇచ్చేలా ఒక శిక్షణా, నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను
అదేశించారు.

గుండ్లపోచంపల్లిలో అవసరం అయిన మౌళిక వసతులను అభివృద్ది పరచాలని, పార్కు నిర్వహాణ కోసం అవసరం అయిన కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాశమైలారం టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అక్కడ అవసరం అయిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని టియస్ ఐఐసి అధికారులకు మంత్రి అదేశాలు జారీ చేశారు. ప్రజలకు చేనేత వస్ర్తాలు మరింతగా అందుబాటులో ఉండేలా చేసేందుకు నూతనంగా టెస్కో వెబ్ సైట్ ఏర్పాటు, టెస్కో కేంద్రాల పెంచడం వంటి , రీ బ్రాండింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

KTR Reviews Handloom department

టెక్స్ టైల్ శాఖ ద్వార చేపడుతున్న నేతన్నకు చేయూత, చేనేత మిత్రా, లూమ్స్ అప్ గ్రేడేషన్ వంటి కార్యక్రమాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలను మరింతగా లబ్దిదారుల్లోకి తీసుకుని వెళ్లేందుకు అవసరం అయితే కమ్యూనీటీ కోఅర్డినేటర్లను కొంత మందిని నియమించుకోవాలని అదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమాన్ని ఏలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మెత్తం చీరలను రాష్ర్టంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు, సెప్టెంబర్ మూడోవారంలోగా అన్ని చీరలు పంపీణీకి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే ఈ చీరల డిజైన్లు, క్వాలీటీ ఏంపికపైన సెర్ప్ మహిళా సంఘాలతో చర్చించి పలు డిజైన్లను ఏంపిక చేసినట్లు తెలిపారు. సిరిసిల్లాలోని అప్పారెల్ పార్కు, గ్రూప్ వర్క్ షెడ్ల కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -