అమ్మాయి ఉండగానే.. లిఫ్ట్‎లోనే పోసేశారు..

251
Two Young boys Pee In Elevator As Woman Tries To Block Camera
- Advertisement -

ఈ మధ్య కొందరు చైనా యువకులు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు వాళ్లకి పోసుకోవాడనికి స్థలమే దొరకట్టుగా.. లిఫ్ట్‎లోనే పోసేస్తున్నారు. సరదా కోసం పోస్తున్నారో.. పబ్లిసిటీ కోసం చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి గబ్బు గబ్బు చేస్తున్నారు. ఇప్పటికే రెండు నెలల క్రితం ఓ బాలుడు లిఫ్ట్‎లోని నెంబర్స్ ప్యానెల్ మీద మూత్రం పోశాడు. దాంతో ఆ లిఫ్ట్ షార్ట్ సర్క్యూట్‎తో మధ్యలోనే ఆగిపోయింది.

తాజాగా ఇప్పుడు ఇద్దరు యువకులు, ఓ అమ్మాయి లిఫ్ట్ ఎక్కారు. ఎక్కిన కొద్దిసేపటికే.. ఆ ఇద్దరు యువకులు చెరొక సైడ్‎కి వెళ్లి మూత్రం పోశారు. ఆ యువతి లోపలే ఉందని కూడా ఆలోచింలేదు అక్కడే పోసేశారు. అక్కడే ఉన్న ఆ యువతి లిఫ్ట్‎లో ఉన్న సీసీటీవీ కెమెరాను చేతితో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ కెమెరా ఆమెకు అందలేదు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‎గా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చైనా యువతపై మండిపడుతున్నారు. ఇదేం పని అని, వీళ్లకు వేరే ప్లేసే దొరకలేదా..? అని కామెంట్లు చేస్తున్నారు.

https://www.facebook.com/shanghaiist/videos/10156896528211030/?t=41

- Advertisement -