మెట్రోవాటర్ వర్స్క్ పై కేటీఆర్‌ సమీక్ష

236
KTR review on HMWSSB water works
KTR review on HMWSSB water works
- Advertisement -

జంట నగరాల పరిధిలో మెట్రోవాటర్ వర్స్క్ చేస్తున్న పైపులైన్లు, ప్రాజెక్టుల నిర్మాణంపైన మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. నగర శివారు నియోజకవర్గ ఎంఎల్యేలు, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో వాటర్ సప్లై, ప్రాజెక్టు పురోగతిపైన చర్చించారు. నియోజక వర్గాల వారీగా ఏ ఏ బస్తీలకు నీళ్లీస్తారో చెప్పేలా ఒక మ్యాప్ తయారు చేసి ఎంఎల్యేలకు అందించాలని అధికారులను అదేశించారు.

ఈ మ్యాప్‌లో ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనుల వివరాలు, ఖర్చు, ఏప్పటిలోగా పూర్తవుతుందో చెప్పేలా ఉండాలన్నారు. రాజేంద్రనగర్ జెయన్ యన్ అర్ యుయమ్ కింద రాజేంద్రనగర్ సర్కిల్ పరిథిలో చేపట్టిన సమీకృత నీటి సరఫరా పథకం పనుల్లో జాప్యంపైన మంత్రి తీవ్ర అగ్రహం వక్త్యం చేశారు. ఈ పథకంలో జరిగిన 7 సంవత్సరాల జాప్యంపైన పూర్తి స్ధాయి నివేధిక ఇవ్వాలని మెట్రో వాటర్ వర్క్స్ యండిని అదేశించారు. పథకం ప్రారంభం నాటి నుంచి జరిగిన పనులు, అలస్యానికి బాద్యులు ఏవరో తేల్చేలా పూర్తి వివరాలుండాలన్నారు. ఈ పథకం ఆలస్యానికి భాధ్యులైన వారీపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మెట్రో వాటర్ వర్క్స్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేసే భాద్యత తీసుకోవాలని మంత్రి అదేశించారు. ఈ వేసవి కాలంలో నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. ఇందుకోసం మెట్రో వాటర్ వర్క్స్ అవరసమైనన్ని ట్యాంకర్లను ఉపయోగించాలన్నారు. మెట్రో వాటర్ వర్స్క్ ఇతర ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న పనుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పైపులైన్ల కోసం తవ్వుతున్న ప్రాంతాల్లో వేంటనే రొడ్డు రిస్టోరేషన్ చేయాలన్నారు. పైపులైన్ల కోసం మెత్తం రోడ్డు తవ్వుతున్న చోట్ల వైట్ టాపింగ్ రొడ్లనే వేయాలన్నారు. ఈ విషయంలో ఏలాంటి ప్రమాదం జరిగిన ఈ ఖచ్చితంగా భాద్యులపైన క్రిమినల్ కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -