ఉగాదికి “అమీ తుమీ” ఫస్ట్ లుక్..

125

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈషా, అదితి మ్యాకల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఊగాది సందర్భంగా విడుదల చేశారు.

  "Ami Tumi" First Look Launched on the Occasion of Ugadi

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న “అమీ తుమీ” ఫస్ట్ లుక్ ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం సింక్ సౌండ్ విధానాన్ని ఉపయోగించానున్నాం. సింక్ సౌండ్ కారణంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది.

అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!