కోబ్‌ మ‌ర‌ణ‌వార్త తెలిసి షాకయ్యా : కేటీఆర్‌

446
ktr cob
- Advertisement -

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్ కోబ్ మరణవార్త షాక్‌కు గురిచేసిందన్నారు.

బ్రయంట్‌ సాధించిన విజయాలను గుర్తు చేసిన కేటీఆర్ …కోబ్ తన ఫేవరెట్ ప్లేయర్ అన్నారు. కోబ్ మరణ వార్త ఎంతో బాధకరమని .. 5సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌, రెండుసార్లు ఎన్‌బీఏ ఫైనల్స్‌ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డు, నాలుగు సార్లు ఆల్‌స్టార్‌ మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌, రెండుసార్లు ఎన్‌బీఏ స్కోరింగ్‌ ఛాంపియన్‌…బ్రయంట్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, కన్నీటితో ప్రార్థిస్తున్నా అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాప్టర్‌ ప్రమాదంలో 41ఏండ్ల బ్రయంట్‌, ఆయన కూతురు జియానా(13)తో సహా మరో 9 మంది దుర్మరణం చెందారు.

- Advertisement -