గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన జానీ మాస్టర్..

586
Jani Master
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన జానీ మాస్టర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమాలో చూశాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం చెట్లను నరికి వేస్తున్నారని అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందని అన్నారు. మనం ఉండడానికి భవనాలు ఎంత అవసరమో బతకడానికి చెట్లు కూడా అంతే అవసరం కాబట్టి వాటిని ప్రతిఒక్కరు రక్షించాలని కోరారు.

jani

అదే విధంగా ఒక సినిమా సెట్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ తన షూటింగ్ కోసం వేసిన సెట్ అంతా చెట్టునుండి వచ్చే చెక్కతో చేయబడినది దీని వలన చెట్లు అంతరించి పోతున్నాయి అని అందువలన చెక్కను వాడకుండా ఇకపై నా సెట్టింగ్లు ఇనుము; స్టీల్ తోనే ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారని జానీ మాస్టర్‌ తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నేను మరొక నలుగుర్ని 1)శేఖర్ మాస్టర్ 2)గణేష్ మాస్టర్ 3)రఘు మాస్టర్ 4)హీరోయిన్ రష్మిక మందన లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -