కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏమైంది.. బీజేపీకి కేటీఆర్‌ ప్రశ్న

34
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తెలంగాణ రాష్ట్రంపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతోందన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ… తమ ఆధీనంలో ఉన్న సంస్థలను రాష్ట్రాలపై ఉసిగొల్పుతూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నది అందరికి తెలిసిందే… ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌.. తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతూ.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్న నేపథ్యంలో మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని పలుమార్లు కోరిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికతో పాటు పలు మార్లు బహిరంగ సభల్లో సైతం కేంద్ర ప్రభుత్వ వైఖరిని.. బీజేపీ పార్టీ నియంతృత్వ ధోరణిని ఎండగడుతూనే ఉన్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎత్తిచూపుతూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా మొండి చేయి చూపుతుంటే.. అడగాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు… ఆ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు నోరు మెదపకుండా ఉంటున్నారంటూ మంత్రి కేటీఆర్ ఫైర్‌ అయ్యారు.

కాజీపేట‌కు రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని తీసుకురావ‌డంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత‌లు విఫలం అయ్యారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్ట‌రీ వాగ్ధానం చేశార‌ని, కానీ బీజేపీ నేత‌లు ఆ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోతున్నార‌ని.. ఇటు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సైతం కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో తీవ్రంగా విఫలమయ్యారని మంత్రి కేటీఆర్‌ విమ‌ర్శించారు. ఇత‌ర ప్రాంతాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కోచ్ ఫ్యాక్ట‌రీల‌ను కేటాయిస్తుంటే, మ‌రెందుకు మ‌న రాష్ట్రానికి ఆ నేత‌లు కోచ్ ఫ్యాక్ట‌రీని తీసుకురాలేక‌పోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌శ్నించారు.భార‌తీయ రైల్వేశాఖ అస్సాంలోని కోక్రాజార్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు ఇండియ‌న్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలిపింది. ఆ ట్వీట్ ఆధారంగా మంత్రి కేటీఆర్ .. తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను నిల‌దీశారు.

- Advertisement -