- Advertisement -
కరోనా వైరస్ నియంత్రణకు మెడిసిన్ లేదు.. దాని నివారణకు సామాజిక దూరం ఒక్కటే మార్గం . ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండి.. సామాజిక దూరాన్ని పాటించేలా అవగాహన కల్పిస్తూనే మరోవైపు కరోనాపై పోరుకు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు,సినీ నటులు ముందుకురాగా తాజాగా ఓ దివ్యాంగుడు తాను సైతం అంటూ ముందుకువచ్చారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం బాలాజీ నగర్ కు చెందిన బండి వాసు అనే వికలాంగుడు కరోనా బాధితుల కోసం తన ఒక నెల పెన్షన్ 3016 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బండి వాసును ప్రత్యేకంగా అభినందించారు.
- Advertisement -