సిద్దార్ధ మృతి బాధాకరంః కేటీఆర్

401
ktr Vg
- Advertisement -

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యస్ఎం కృష్ణ అల్లుడు, కేప్ కాఫీ డే ఓనర్ వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిద్దార్ధ్ జీవితం ఇక్కడితో ముగియడం బాధగా ఉందన్నారు.  సిద్దార్ద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి షాక్ గురయ్యానని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అని ట్వీట్ చేశారు కేటీఆర్. సిద్దార్ద ఫ్యామిలీ, స్నేహితులు, కేఫ్ కాఫీ డే ఉద్యోగులకు ఇది చేదువార్త అన్నారు.

బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రావతి నది బ్రిడ్జిపై కారులో సోమవారం సాయంత్రం వెళుతున్న వీజీ సిద్ధార్థ.. నేత్రావతి నది వంతెన రాగానే ఆపారు. కారు దిగిన ఆయన.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్‌.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్‌ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోని దిగిన పోలీసులు సిద్ధార్ధ మృత దేహాన్ని వెతికిపట్టారు.

ktr Tweet

- Advertisement -