పెట్టుబడులకు సహకారం అందిస్తాం…..

201
Ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికిపెట్టుబడులు అకర్షించేందుకు దక్షణ కొరియాలో మంత్రి కెటి రామారావు పర్యటన ఈ రోజు మొదలైంది. దక్షణ కొరియాలో భారత రాయభారి విక్రమ్ దొరైస్వామితో మంత్రి సమావవేశం అయ్యారు. మంత్రి ఈరోజ సామ్ సంగ్ కంపెనీ సీనియర్ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు. సామ్ సంగ్ సీనియర్ ఉపాద్యక్షులు సంగ్ మోయిమ్‌, ఉపాధ్యాక్షులు పీటర్ రీ తో కూడిన ప్రతినిదుల బృందంలో మంత్రి తెలంగాణలో ఉన్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ అవకాశాలపైన చర్చించారు.

Ktr meeting Korean industrial park

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ఏర్పాటుకున్న సౌకర్యాలను వివరించిన మంత్రి రాష్ర్టంలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన మౌళిక వసతులు, ప్రత్యేక పాలసీని వివరించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైజ్ మాన్యూపాక్చరింగ్ పార్కులో యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా సామ్ సంగ్ సంస్ధను అహ్వనించారు. సామ్ సంగ్ ఇన్నోవేషన్ మ్యూజియంను సందర్శించారు. హైదరాబాద్‌లో అర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, స్ధానిక భాషల్లో ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రయత్నించాలని మంత్రి సంస్ధను కోరారు. సామ్ సంగ్ సంస్ద ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి సంస్ధ ప్రతినిధులకు తెలియజేశారు.

Ktr meeting Korean industrial park

భారత చాంబర్ అప్ కామర్స్ దక్షిణ కొరియా ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్‌ కొరియా (ఐసీసీకె) ఏర్పాటు చేసిన వ్యాపార వేత్తల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. సియోల్‌లో జరిగిన ఈ సమావేశంలో సూమారు వందకు పైగా వివిధ కంపెనీల ప్రతినిధులు హజరయ్యారు. తెలంగాణ రాష్ర్టం గురించి వివరించిన మంత్రి, ఇక్కడి ప్రభుత్వ విధానలపైన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానంలోని సింగిల్ విండో అనుమతులు, 15 రోజుల్లో ఖచ్చితమైన అనుమతుల వంటి విశిష్టమైన అంశాలను వారికి మంత్రి తెలియజేశారు.

మంత్రి ప్రసంగం ద్వారా ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌టైల్స్,లైప్ సైన్సెస్, అటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లోని సంస్ధలకు ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను, సౌకర్యాలను, ప్రభుత్వం అందించే సౌకర్యాలను పైన కొనసాగింది. అయా కంపెనీల ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, మంత్రి ప్రసంగాన్ని అభినందించారు.

Ktr meeting Korean industrial park

కొరియాలో భారత రాయబారి విక్రం దొరైస్వామి అద్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొరియా సంస్ధల కోసం ప్రత్యేకంగా కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్ పెట్టుబడికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కొరియన్ కంపెనీలకు భారత దేశంలో ఉత్తమ సౌకర్యాలు, పాలసీలు ఉన్న తెలంగాణ రాష్ర్టమే అత్యుత్తమ అకర్షనీయమైన ప్రాంతంగా మంత్రి అభివర్ణించారు. మంత్రి వెంబడి పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్‌ డైరెకర్ట్ సుజయ్ కారంపూరిలు ఉన్నారు.

- Advertisement -