ఇంజినీరింగ్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

115
minister ktr
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సైతం విద్యుత్ ఉద్యోగుల పనీతీరుతోటే అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్ రూపొందించిన 2021 డైరీ,క్యాలెండర్ లను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలతో కలసి ఆయన సోమవారం ఉదయం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉద్యమం సమయంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ విషయంలో ఇచ్చిన 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా విజయవంతం చేయడం వెనుక విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు. సాధక బాధకాలు తెలిసిన వారికే యాజమాన్య బాధ్యతలు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేశారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో & జెన్ కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్ఎస్పిడిసియల్ సి యండి రఘుమారెడ్డి లతో పాటు విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్ శెట్టి, సలహాదారుడు అలుగుబెల్లి సురేందర్ రెడ్డి, కంపెనీ అధ్యక్షులు తుల్జారం సింగ్, లక్ష్మయ్య లతో పాటు కార్యదర్శి వై.నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -