ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్‌ని నివారించవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ప్రారంభించిన కేటీఆర్ ..బసవతారకం సేవా పన్నును రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారని ఈ మేరకు రూ. 6 కోట్ల పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పై ప్రేమతో తనకు తారకరామారావు అనే పేరు పెట్టారని ఆ పేరుని ఎప్పటికి చెడగొట్టే పని చేయనని తెలిపారు.
గత పదేండ్లలో ఏముఖ్యమంత్రి పన్ను రద్దుచేయాలని విన్నవించిన పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రి బయట రోగుల కోసం షల్టర్లను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున మరిన్ని షల్టర్లు నిర్మిస్తామన్నారు. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది ప్రజలకు కేన్సర్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు టాటా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
బసవతారకం ఆసుపత్రి గురించి మా అమ్మ నాకు కనీసం వంద సార్లు చెప్పి ఉంటారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి, ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని చెప్పేవారు అని తెలిపారు. తాను మంత్రి అయిన తర్వాత కూడా ఆసుపత్రి గురించి అమ్మ చాలా సార్లు గుర్తు చేశారని చెప్పారు.
40 పడకల ఆస్పత్రిగా ప్రారంభమైన బసవతారకం హాస్పిటల్ కు ప్రపంచస్ధాయి గుర్తింపు తగ్గిందంటే వైద్యుల కృషి ఎంతగానో ఉందన్నారు నందమూరి బాలకృష్ణ. సేవా పన్ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి,సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోనే నెంబర్ 1 ఆస్పత్రిగా ఎన్నో అవార్డులు పొందిందన్నారు. రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ మేనేజ్ మెంట్ అవార్డు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తన కుమారుడికి తారకరామారావు అని కేసీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని చెప్పారు.