మెగాస్టార్..కొర‌టాల ను సెట్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

246
Koratala Siva's Next With Chiranjeevi? this two legends combination is set to pawan kalyan
- Advertisement -

భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో టాప్ డైరెక్ట‌ర్ లిస్ట్ లో చేరిపోయాడు కొర‌టాల శివ‌. తిసిన ప్ర‌తి సినిమా అంచనాల‌ను మించుతుండ‌టంతో అత‌నిపై భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు హీరోలు, నిర్మాత‌లు. భ‌రత్ అనే నేను సినిమా అత‌ని స్ధాయి మ‌రింత పెంచింది. కొర‌టాల శివ త‌రువాతి సినిమా ఏ హీరోతో చేయ‌నున్నాడ‌నే ఆస‌క్తి నెల‌కొంది. మెగాస్టార్ చిరంజివితో కొర‌టాల త‌ర్వాతి సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Koratala Siva's Next With Chiranjeevi? this two legends combination is set to pawan kalyanఇప్ప‌టికే చిరంజివికి కొర‌టాల క‌థ కూడా చెప్పాడ‌ని…అందుకు చిరంజీవి కూడా ఓప్పేసుకున్నాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్ ను సెట్ చేసింది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని తాజా స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి స్టోరీ చెప్పాడు కొర‌టాల శివ‌. శివ చెప్పిన స్టోరీ బానేఉంది అని.కానీ తాను ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజిగా ఉన్నాన‌ని చెప్పాడ‌ని స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొర‌టాల శివ‌ను చిరంజీవి ద‌గ్గ‌ర‌కు పంపిండని టాక్. ఈస్టోరీ అన్న‌య్య‌కు క‌రెక్ట్ సెట్ అవుతుందిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొర‌టాల ను చిరంజీవి ద‌గ్గ‌ర‌కు పంపించాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Koratala Siva's Next With Chiranjeevi? this two legends combination is set to pawan kalyan

కొర‌టాల శివ‌  చెప్పిన క‌థ విన్న చిరంజీవి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడంట‌. ప‌వ‌న్ తో చేద్దామ‌నుకున్నకొర‌టాకు ఏకంగా మెగాస్టార్ తో అవ‌కాశం రావ‌డంతో చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం చిరంజీవి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా మూవీలో బిజిగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌రుస హిట్ల‌తో దూకుడుమీదున్న కొర‌టాల మెగాస్టార్ తో బంప‌ర్ హిట్ కొట్ట‌డానికి సిద్దంగా ఉన్నాడ‌నే చెప్పుకోవాలి.

- Advertisement -