కేటీఆర్‌…డైనమిక్ పర్సన్

375
ktr uttam
- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి కేటీఆర్ డైనమిక్‌ పర్సన్ అని కొనియాడిన ఉత్తమ్ ….హైదరాబాద్‌, విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైల్వేలైన్‌ కోసం కృషిచేస్తే మంత్రి కేటీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఇది రెండు తెలుగు రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజనల్‌ కేం ద్రంగా ప్రకటించి, నూతన కార్యాలయం ప్రారంభించినందుకు ప్రభుత్వానికి, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్‌….ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేండ్లు పూర్తిచేసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ సందర్భంగా కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -