నేడు జాతినుద్దేశించి మోడీ ప్రసంగం…

149
pm modi

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్, అన్‌లాక్,చైనా యాప్స్‌పై నిషేధం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. కంటెయిన్‌మెంట్ జోన్లు మినహా ఇతర జోన్లలో పలు కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు జులై 31 వరకు మూసివేయాలని సూచించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్‌పూల్స్‌పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

కరోనా కేసులు పెరుగుతుండటం, చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది.