డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా…

177
padmarao

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారీన పడ్డారు.

తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలతో ఆయనకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ సహా ఆయన కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది.

అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తాకి కరోనా సోకింది. వీరు హోం క్వారంటైన్‌లో ఉండగా మహమూద్ అలీ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.