శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించారు మంత్రి కేటీఆర్. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలు పెంచుతున్న తీరు, ఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రజలకు అందించే ప్రక్రియ వంటి పలు అంశాల పైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నర్సరీ లో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, నర్సరీ లో పనిచేసే అర్హులైన వారందరికీ ఈ ఎఫ్, పి ఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించే ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు అదేశించారు.తెలంగాణ ప్రభుత్వం ఈసారి హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలుచేపట్టిందని ముఖ్యంగా పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడం తోపాటు వాటిని పెంచడం పైన ఇప్పటికే శాఖ తరఫున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీలున్న ప్రాంతాలతో పాటు వాటి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నింటిని తో కూడిన సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతాం అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీ ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామని తెలిపారు కేటీఆర్
.