కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం..

196
Ktr For WEF Summit
- Advertisement -

ఐటీ,పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది.  జనవరిలో జరగనున్న వరల్డ్  ఎకానామిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు  హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది. స్విడ్జర్‌ల్యాండ్ లోని దావోస్‌లో జనవరి 17 ,18 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు.

ఈ సమావేశంలో ప్రతి ఏడాది సూమారు 2500 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, ఆర్దికవేత్తలు హాజరుకానున్నారు.సాధారణంగా  కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ సదస్సుకు అహ్వానం దక్కుతుంది.  తొలిసారిగా రాష్ట్రమంత్రికి ఆహ్వానం దక్కడం విశేషం.

 Ktr For WEF Summit
తెలంగాణ రాష్ట్రం ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానంలో నిలవడంపై అభినందనలు తెలిపిన ఫోరమ్‌..ఇందుకోసం చురుగ్గా పనిచేసిన కేటీఆర్‌కు ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపింది. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకానిమిక్ ఫోరమ్ సదస్సుల్లో పాల్గొనడం, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రెకెత్తించిన వరల్డ్ ఎంట్రప్రెన్యూర్స్ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించిన తీరు, మంత్రి భాగసామ్యాన్ని ప్రత్యేకంగా పరిగణించింది.

రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేటీఆర్‌ ప్రపంచ దేశాల నుంచి రానున్న పలు కంపెనీల సీఈవోలు,ఛైర్మన్లతో సమావేశమవుతారు. డ్యబ్లుఈఎఫ్‌ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం లభించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడుల అవకాశాలను ప్రపంచం ముందు ఉంచుతామన్నారు.  గతంలో చైనాలోని డాలియాన్లో వరల్డ్ ఎకానిమిక్ ఫోరమ్ నిర్వహించిన సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హజరయ్యారు.

- Advertisement -