తిత్తిభాసనంతో.. ఆ సమస్యలు దూరం!

6
- Advertisement -

యోగాలో కాస్త కష్టతరమైన ఆసనాలలో తిత్తిభాసనం కూడా ఒకటి. ఈ ఆసనం వేయడం ఎంతో సాధనతో కూడుకున్నది. అయితే ఈ ఆసనం వేయడం కాస్త కష్టతరమే అయినప్పటికి దీని వల్ల ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తొడలు, పిరుదుల భాగంలో పెరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు ఈ ఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల కాళ్ళకు వెన్నెముకకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చేతులు దృఢంగా తయారవుతాయి. మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత ను పెంచుతుంది. మగవారిలో అంగస్తంబన వంటి శృంగార సమస్యలను దూరం చేస్తుంది. ఆడవారిలో రుతుక్రమ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉదర భాగాలను బలపరుస్తుంది.

తిత్తిభాసనం వేయు విధానం
ఈ ఆసనంలో రెండు కాళ్ళను ముందుకు చాపాలి. ఆ తరువాత కాళ్ళ మద్యలో చేతులను ఉంచి శరీరాన్ని ముందుకు వంచాలి. ఇలా చేసిన తరువాత శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ శరీర భారమంతా చేతులపై ఉంచి రెండు కాళ్ళను చేతుల భుజల వరకు పైకి ఎత్తాలి. ఈ సమయంలో శరీరభారం నడుముపై కెంద్రీకరించాలి. ఈ సమయంలో శ్వాస క్రియ నెమ్మదిగా జరిగిస్తూ వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండాలి.

జాగ్రత్తలు
అధిక నడుము నొప్పి, హెర్నియా, వెన్ను సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు. అలాగే కడుపు భాగంలో సర్జరీ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:కవిత బెయిల్..24న సమగ్ర విచారణ

- Advertisement -