మంత్రి కేటీఆర్ బర్త్ డే…రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

326
ktr birthday special
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం,పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా బాల కేంద్రంలో మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వై.వెంకటేశ్వర్లు ,మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ తదితులు పాల్గొన్నారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ ,ఆమన్గల్ ,వెల్దండ.,మండల కేంద్రాలలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటి పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కళాసిగూడ లోని ప్రభుత్వ పాఠశాలలో DEO వెంకటనర్సమ్మ తో కలిసి విద్యార్ధులకు బుక్స్ పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

అనంతరం రాంగోపాల్ పేట కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం..కేటీఆర్ యూత్ ఐకాన్ ,డైనమిక్ లిడర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆణిముత్యాన్ని మనకు అందించారని తెలిపారు.

కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో రక్తదానం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , స్థానిక ప్రజాప్రనిధులు ఉన్నారు.

మంత్రి కేటీఆర్ జన్మదిన దినోత్సవ రోజున సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య . తల్లాడ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మంది కార్యకర్తలు , అభిమానులు రక్తదానం చేశారు.

తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి,టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హుస్సేనీ ఆలంలోని జామియా నిజామియాలో స్ప్రేయింగ్ మిషన్లు పంపిణీ చేశారు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ . కరోనా మహమ్మారి ప్రబలుతున్న సందర్భంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలన్న మంత్రి కేటీఆర్ పిలుపుతో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ మిషిన్లను పంపిణీ చేశాం అని తెలిపారు బాబా ఫసీయుద్దీన్. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను విశ్వ నగరం వైపు నడిపిస్తున్నారు
…అందరూ కరోనా మహమ్మారి తరిమికొట్టడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -