నందినగర్‌లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

16
- Advertisement -

మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కూడి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ గారలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్ గారు, మిఠాయీలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు.

Also Read:పేమెంట్ కోటాలో వచ్చావా?, రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

- Advertisement -