ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కేటీఆర్

436
ktr
- Advertisement -

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.

కంపెనీస్‌ యాక్ట్‌-2013 ప్రకారం ఏర్పాటైన ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ మొదటి సమావేశం 2017 ఆగస్టు 31న జరిగింది. తర్వాత 2019 అక్టోబర్‌ 29న నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ను చైర్మన్‌గా నియమించాలని తీర్మానంచేసి ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కేటీఆర్‌ పేరును ప్రతిపాదిస్తు గవర్నర్‌కు పంపించగా తమిళిసై అమోదముద్ర వేశారు. వైస్‌చైర్మన్‌గా ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌గా సుజయ్‌ సుభాష్‌ కారంపూరి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది.

- Advertisement -