రెండు దఫాలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

410
loksabha
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభం అయ్యాయి. ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం అనంతరం సమావేశాలు జరగనున్నాయి.

రెండు విడతలుగా సమావేశాలు జరగనున్నాయి. నేటి (జనవరి 31) నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సెషన్ జరగనుంది. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు.

తొలిదశలో 12 రోజులపాటు సాగే ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే పద్దును కూడా కలిపి దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఇక ఈ సారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడగా జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ అంశంపై చ‌ర్చ సాగుతుంద‌ని జాతీయ మీడియా అంచ‌నా వేస్తోంది.

- Advertisement -