కేటీఆర్, హ‌రీష్ రావుకు మంత్రివ‌ర్గంలో చోటు లేన‌ట్టేనా..

264
ktr harish rao
- Advertisement -

రాష్ట్ర మంత్రి విస్తరణకు ముహుర్తం ఖరారైనట్టే అనిపిస్తుంది. రెండవసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత సీఎం కేసీఆర్ తో పాటు హోంమంత్రిగా మ‌హ‌మ్ముద్ అలీ మాత్ర‌మే ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మిగ‌తా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై సీఎం కేసీఆర్ క‌స‌రత్తు చేస్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్ర‌కారం మొత్తం 18 మందికి మంత్రులుగా ఉండే అవ‌కాశం ఉంది. అయితే తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈమంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు రెండు ద‌శ‌లుగా చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. మొద‌ట‌గా ఆరు లేదా ఎన‌మిది మందితో క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం క్యాబినెట్ లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈసంద‌ర్భంగా తొలి విడ‌ద‌తలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హ‌రీష్ రావుల‌కు చోటు క‌ల్పిస్తారా లేదా ఆనే అంశం ఇప్పుడు రాష్ట్ర‌ రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం వీరిద్ద‌రికి మొద‌టి విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు చేన‌ట్టే అని తెలుస్తుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు కుడి చెయ్యిలా ఉన్నారు హ‌రీష్ రావు. ఉద్య‌మ కాలం నుంచి ట్ర‌బుల్ షూట‌ర్ గా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌నకు అప్ప‌గించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్దుల విజ‌యం ఖాయ‌మ‌ని కేసీఆర్ కుడా న‌మ్ముతారు. ఇటివ‌లే జ‌రిగిన అన్ని ఉపఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు కీలక పాత్ర పోషించారు. మ‌రోవైపు రెండ‌వ‌సారి అధికారంలోకి వ‌చ్చిన‌వెంట‌నే కేటీఆర్ కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌ద‌వి బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు సీఎం కేసీఆర్. పార్టీ బాధ్య‌త‌ల‌ను పూర్తిగా కేటీఆర్ కు అప్ప‌గించారు కేసీఆర్. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గులాబీపార్టీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో గెలుపొందడంలో కేటీఆర్‌ తనదైన పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్‌కు తొలి విస్తరణలో అవ‌కాశం వ‌స్తుందా లేదా అన్నది స‌స్పెన్స్‌గా మారింది.

మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కేటీఆర్ మెజారీటి స్ధానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. అలాగే హ‌రీష్ రావుకు అప్పగించిన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మెజారీటీ స్ధానాలకు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ లో బలమైన నాయకులుగా పేరున్న డికె. అరుణ, రేవంత్ రెడ్డి, చిన్నారెడ్డిలను ఓడించడంలో కీలకపాత్ర పోషించారు హరీష్ రావు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్దాయి మంత్రివర్గ విస్తరణ ఉండనుందని తెలుస్తుంది. మొదటి విడతలో కేటీఆర్, హరీష్ రావు ఎందుకు చోటు దక్కలేందంటే.. కేసీఆర్ తర్వలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అందుకోసం పార్లమెంట్ స్దానాలు కూడా చాలా ముఖ్యం. కేటీఆర్, హరీష్ రావు లకు పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారని పార్టీలో వర్గాల సమాచారం. చూడాలి మరి సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో.

- Advertisement -