ఐసీయూలో కృష్ణంరాజు..

647
krishnam raju
- Advertisement -

సినీనటుడు,రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతన్న ఆయన బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు.

ఐసీయులో కృష్ణంరాజుకు చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఆయన బీజేపీలో చేరి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ప్రభాస్‌తో తన సొంత బ్యానర్‌ గోపీ కృష్ణా మూవీస్‌పై సినిమా నిర్మించే పనిలో ఉన్నారు.

1998 లో కాకినాడ నియోజకవర్గం నుండి 12 వ లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు కృష్ణంరాజు. తర్వాత నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన కృష్ణంరాజు వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

- Advertisement -