ఐపీఎల్‌ ట్రేడింగ్… నేడే చివరిరోజు

430
ipl trading

ఐపీఎల్ 2020 సీజన్‌ ట్రేడింగ్‌ నేటితో ముగియనుంది. ట్రేడింగ్ విధానం ద్వారా ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను ఇతర ప్రాంఛైజీల ఆటగాళ్లను పరస్పరం ఎక్స్‌చేంజ్ చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ ట్రెంట్‌ బౌల్ట్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు మారాడు.

2014లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బౌల్ట్‌ 33 మ్యాచ్‌లాడి 38 వికెట్లు తీశాడు. ఇక దేశవాళీ సీమర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ పంచన చేరాడు. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారారు.

నవంబర్ 15వ తేదీన రిటైన్ అయిన ఆటగాళ్లు, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు విడుదల చేయాల్సి ఉంది. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో మొదటిసారి క్రికెటర్ల వేలం కోల్‌కతాలో జరగనుండటం విశేషం.